45 ఏళ్లు దాటిన వారికి అపోలోలో రేపటి నుంచి వ్యాక్సినేషన్
- మార్గదర్శకాలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
- కొవిన్ యాప్‌లో నమోదు చేసుకుంటేనే టీకా
- నేరుగా వచ్చే వారికి వ్యాక్సిన్ ఇవ్వబోమన్న అపోలో
హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో రేపటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయనున్నారు. 45 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీకాలు వేస్తామని, అయితే వారందరూ కొవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని అపోలో యాజమాన్యం తెలిపింది. నేరుగా వచ్చేవారికి వ్యాక్సిన్ ఇవ్వబోమని స్పష్టం చేసింది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఉన్న మార్గదర్శకాలను సవరించింది. దీని ప్రకారం.. 45 ఏళ్లు పైబడిన వారికి మొదటి, రెండో డోసు టీకాలు వేసేందుకు అవసరమైన టీకాలు డైరెక్టుగా కొనుగోలు చేసుకోవచ్చు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుంచి టీకాలు నేరుగా కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అపోలో తాజా ప్రకటన చేసింది.