నేడు మరికాస్త తగ్గిన పుత్తడి ధర.. భారీగా పెరిగిన వెండి రేటు!

  • పది గ్రాములకు రూ. 317 తగ్గుదల 
  • రూ. 2 వేలకు పైగా పెరిగిన వెండి ధర
  • అంతర్జాతీయ ఒడిదొడుకులే కారణం
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పుత్తడి ధర నేడు మరికాస్త తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 317 తగ్గి రూ.46,382కు చేరుకుంది. నిన్న పది గ్రాముల పసిడి ధర రూ. 46,699 వద్ద ట్రేడైంది.

ఇక ఎప్పుడూ బంగారం ధరతోపాటే పయనించే వెండి ధర మాత్రం నేడు భారీగా పెరిగింది. కిలోకు ఏకంగా రూ.2,328 పెరిగి రూ. 70,270కి ఎగబాకింది. దేశంలో బంగారం ధర క్షీణతకు అంతర్జాతీయ ధరల్లో ఒడిదొడుకులే కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1776 డాలర్లుగా ట్రేడవగా, వెండి ధర 26.42 డాలర్లుగా ఉంది. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ. 48,350గా ఉండగా, వెండి కిలో రూ.73,890గా ఉంది.


More Telugu News