మోదీ చెప్పడమే తరువాయి.. లాక్‌డౌన్ పెట్టేస్తాం: యడియూరప్ప

  • రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 44 వేలకు పైగా కేసులు
  • కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా తగ్గని ఉద్ధృతి
  • ఈ రోజే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామన్న సీఎం
రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టాలా? వద్దా? అనేది ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయంపై ఆధారపడి ఉందని, ఆయన ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం లాక్‌డౌన్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని యోచిస్తున్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 44,631 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ వైపు ముఖ్యమంత్రి దృష్టిసారిస్తున్నారు. ప్రధాని ఆదేశాల అనంతరం నేడే ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు యడియూరప్ప వివరించారు.


More Telugu News