బిల్ గేట్స్ నుంచి నేను భరణాన్ని ఆశించడం లేదు: మిలిందా
- విడాకులు తీసుకోబోతున్నట్టు నిన్న ప్రకటించిన బిల్ దంపతులు
- ఈ విషయంలో ముందస్తు ఒప్పందం ఏదీ చేసుకోలేదన్న మిలిందా
- ఆస్తుల పంపకంలోనూ అంతేనని స్పష్టీకరణ
తాము విడాకులు తీసుకోబోతున్నట్టు వెల్లడించి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ఈ మేరకు నిన్న మిలిందా, బిల్ గేట్స్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టు తెలిపారు. అయితే, అంతలోనే ఏమైందో కానీ మిలిందా నేడు చేసిన ప్రకటన అందరినీ మరోమారు ఆశ్చర్యంలో ముంచెత్తింది. విడాకుల విషయంలో తాము ఎలాంటి ముందస్తు ఒప్పందమూ చేసుకోలేదని పేర్కొన్నారు. అలాగే, ఆస్తుల పంపకం గురించి కూడా తమ మధ్య ఎలాంటి అంగీకారమూ కుదరలేదన్నారు.
అంతేకాదు, బిల్ నుంచి తాను భరణాన్ని ఆశించడం లేదన్నారు. అలాగే, దాంపత్యపరమైన సాయాన్ని అర్థించబోనని తేల్చిచెప్పారు. కాగా, బిల్, మిలిందాలు ఇద్దరూ.. బిల్ అండ్ మిలిందా గేట్స్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు 53 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద కార్యక్రమాల కోసం వినియోగించారు. తాము విడిపోయినప్పటికీ ఫౌండేషన్ కొనసాగుతుందని, దాని కోసం కలిసి పనిచేస్తామని బిల్, మిలిందాలు ఇప్పటికే ప్రకటించారు.