గవర్నర్‌ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని తెలిపిన స్టాలిన్
- తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన డీఎంకే
- స్టాలిన్ తో పాటు వెళ్లిన టీఆర్ బాలు, దురై మురుగన్
- ప్రమాణ స్వీకార తేదీని గవర్నరే నిర్ణయిస్తారన్న డీఎంకే నేత
తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నెల 7న స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తాజాగా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈ రోజు తమిళనాడు గవర్నర్ భన్వరి లాల్ పురోహిత్‌ను స్టాలిన్, టీఆర్ బాలు, దురై మురుగన్ కలిసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఈ విషయంపై డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మీడియాతో మాట్లాడుతూ... స్టాలిన్, బాలు, దురై మురుగన్ కలిసి గవర్నర్‌ను కలిసి తీర్మానాన్ని సమర్పించారని, ప్రమాణ స్వీకారోత్సవ తేదీని గవర్నరే నిర్ణయిస్తారని చెప్పారు.