మాస్క్ ధరించకుంటే రూ. 200 వరకు జరిమానా: ఏపీలో గ్రామ పంచాయతీల తీర్మానం

  • వీధుల్లోకి వచ్చినా, మరో గ్రామానికి వెళ్లినా మాస్క్ తప్పనిసరి
  • శుభకార్యాలకు పరిమితికి మించి అనుమతి నిరాకరణ
  • మార్గదర్శకాలు జారీ చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గ్రామ పంచాయతీలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరు మాస్కు పెట్టుకోవాలని, లేదంటే జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నాయి. వీధుల్లోకి వచ్చినా, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లినా మాస్కు ధరించాల్సిందేనని, ఉల్లంఘించిన వారు జరిమానా చెల్లించకతప్పదని స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 70 శాతం పంచాయతీలు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. రెండో దశలో గ్రామాల్లోకీ వైరస్ పాకిపోవడంతో అప్రమత్తమవుతున్న పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి కట్టడికి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 50 నుంచి రూ. 200 వరకు జరిమానా వసూలు చేస్తారు. అలాగే, ఇతర గ్రామాల వారు మాస్కు పెట్టుకోకుండా వస్తే అనుమతించరు. పెళ్లిళ్లు, పేరంటాలకు పరిమితికి మించి అనుమతించకూడదని ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు చెబుతున్నాయి. వీటిని అమలు చేసే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలదేనని స్పష్టం చేసింది.


More Telugu News