కరోనా నివారణకు భారత్ కు భారీ సాయం ప్రకటించిన శాంసంగ్
- భారత్ కు 5 మిలియన్ డాలర్లను ప్రకటించిన శాంసంగ్
- తమిళనాడు, యూపీలకు ఇవ్వనున్నట్టు వెల్లడి
- ఇప్పటికే భారత్ కు సాయం ప్రకటించిన పలు కంపెనీలు
భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఊహించని స్థాయిలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఎంతోమంది మహమ్మారికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు, ప్రముఖ వ్యాపార సంస్థలు భారత్ కు తమ వంతు సాయం అందిస్తున్నాయి. తాజాగా శాంసంగ్ సంస్థ కూడా సాయాన్ని ప్రకటించింది.
భారత్ కు 5 మిలియన్ డాలర్లను (రూ. 37 కోట్లు) ఇవ్వనున్నటు శాంసంగ్ ప్రకటించింది. ఇందులో సుమారు రూ. 22 కోట్లు తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు ఇవ్వనున్నట్టు తెలిపింది. మిగిలిన డబ్బును 100 ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లు, 3 వేల ఆక్సిజన్ సిలిండర్లు, 10 లక్షల ఎల్డీఎస్ సిరంజిలతో పాటు ఇతర వైద్య సామగ్రిని కొనుగోలు చేసేందుకు వినియోగిస్తామని వెల్లడించింది.