60 ఎకరాల్లో గుంట భూమిని కబ్జా చేసినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
- భూకబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్న ముత్తిరెడ్డి
- ఆరోపణలను నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తానని సవాల్
- రాజీనామాను కేసీఆర్ కు అందిస్తానని వ్యాఖ్య
టీఆర్ఎస్ పార్టీని భూకబ్జా ఆరోపణలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇతర నేతలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై కూడా భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ముత్తిరెడ్డి మండిపడ్డారు.
అరవై ఎకరాలలో ఒక్క గుంట భూమిని కబ్జా చేసినట్టు నిరూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని ముత్తిరెడ్డి సవాల్ విసిరారు. ఆరోపణలను నిరూపిస్తే జనగామ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. తన రాజీనామాను అంబేద్కర్ పాదాల వద్ద ఉంచి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేస్తానని అన్నారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి కూడా ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.