వారి ఆరోగ్యం క్షీణిస్తే ప్రభుత్వానిదే బాధ్యత: లోకేశ్
- ప్రజల ప్రాణాలు కరోనాకి వదిలేశారు
- ప్రతిపక్షంపై కక్ష సాధిస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్
- సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కు ఆల్రెడీ కొవిడ్ పాజిటివ్
- ధూళిపాళ్ల కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో ఆ విషయాన్ని పట్టించుకోకుండా సీఎం జగన్ టీడీపీపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
'ప్రజల ప్రాణాలు కరోనాకి వదిలి, ప్రతిపక్షంపై కక్ష సాధిస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి మూర్ఖపు రెడ్డి. పేషెంట్లకు ఆక్సిజన్ అందించడం మానేసి తెలుగుదేశంపై ఆధిపత్యం సాధించేందుకు తాడేపల్లి కొంపలో వ్యూహరచన చేస్తున్నారు' అని లోకేశ్ ఆరోపించారు.
'రాజధానిపై మీ కుట్రల్ని బట్టబయలు చేశారనే కక్షతో సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రగారిని అక్రమంగా అరెస్ట్ చేయించారు. డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్‌గా తేలితే, నరేంద్రగారు కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు' అని లోకేశ్ చెప్పారు.
'వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించకుండా ఏంటీ శాడిజం మూర్ఖపు వైఎస్ జగన్. తక్షణమే నరేంద్ర గారు, గోపాలకృష్ణన్ గార్లకు మెరుగైన వైద్యం అందించాలి. వారి ఆరోగ్యం క్షీణిస్తే ప్రభుత్వానిదే బాధ్యత' అని లోకేశ్ అన్నారు.