ధూళిపాళ్లను జైలుకు పంపాలని సీఎం జగన్ కుట్ర చేశారు: చిన‌రాజ‌ప్ప‌

  • ధూళిపాళ్ల‌ను అరెస్టు చేయించ‌డం పిరికిపంద చ‌ర్య‌
  • కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్
  • ధూళిపాళ్ల అస్వస్థతకు గురయ్యారు
  • మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుప‌త్రికి  తరలించాలి
సంగం డెయిరీ కేసులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు స‌రికాదంటూ మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆయ‌న అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ... ధూళిపాళ్ల‌ను అరెస్టు చేయించ‌డం పిరికిపంద చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ధూళిపాళ్ల అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. క‌రోనా కేసులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో మంచి వాతావరణంలో ఆయనకు వైద్య చికిత్స అవసరమని చెప్పారు. మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుప‌త్రికి  తరలించి చికిత్స అందించాలని విజ్ఞ‌ప్తి చేశారు. రాజకీయ జీవితంలో మచ్చలేని ధూళిపాళ్లను జైలుకు పంపాలని సీఎం జగన్ కుట్ర చేశారని ఆయ‌న ఆరోపించారు.  



More Telugu News