రెండు రోజులతో పోలిస్తే ఏపీలో తగ్గిన కరోనా కేసులు!
- గత 24 గంటల్లో 1,15,275 కరోనా పరీక్షలు
- 18,972 మందికి కరోనా పాజిటివ్
- కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2628 కేసులు
- రాష్ట్రంలో 71 మంది మృతి
- 10,277 మంది కరోనా నుంచి కోలుకున్నారు
ఏపీలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. అయితే గత రెండు రోజులతో పోలిస్తే నేడు కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే అంశం. గడచిన 24 గంటల్లో ఏపీలో 1,15,275 నమూనాల్ని పరీక్షించగా 18,972 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు.
అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2628 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విశాఖపట్నం జిల్లాలో 1,960 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక అత్యల్పంగా కడప జిల్లాలో 969 కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో 10,277 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 11,63,994 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10,03,935 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,51,852 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,207కు పెరిగింది.