కేటీఆర్ భూ అక్రమాలపై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తా: రేవంత్ రెడ్డి
- భూ కబ్జా ఆరోపణలతో ఈటల అవుట్
- మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్
- దేవరయాంజాల్ లో కేటీఆర్ కు భూములున్నాయని ఆరోపణ
- సేల్ డీడ్ ను మీడియాకు విడుదల చేసిన వైనం
- సీబీఐ విచారణకు డిమాండ్
- అమిత్ షాను కలుస్తానని వెల్లడి
భూకబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ పదవీచ్యుతుడైన నేపథ్యంలో, కేటీఆర్ కూడా భూ అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి... నగర శివార్లలోని దేవరయాంజాల్ లో రామాలయ భూముల్లో కేటీఆర్ కు కూడా భూములు ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో కేటీఆర్ పేరుతో ఉన్న సేల్ డీడ్ ను మీడియాకు ప్రదర్శించారు.
రామాలయానికి చెందిన 1,553 ఎకరాల భూమిలో కేటీఆర్ కు, నమస్తే తెలంగాణ దినపత్రిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దామోదర్ రావుకు కూడా భూములు ఉన్నాయని వివరించారు. కేటీఆర్ కు భూమిని అమ్మింది ఎవరో బయటపెట్టాలని అన్నారు. ఈ భూములు ఆన్ లైన్ లో కనిపిచండంలేదని, అవి ఎందుకు మాయం అయ్యాయని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ ను వాడుకుని సర్వేనెంబర్లలో మాయాజాలం చేశారని తెలిపారు.
కేటీఆర్ భూ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలతో కేటీఆర్ భూ అక్రమాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.