నీట్ పీజీ పరీక్షలు నాలుగు నెలల పాటు వాయిదా
- కరోనా పరిస్థితిపై నిన్న సమీక్ష నిర్వహించిన ప్రధాని
- నీట్ పీజీ పరీక్షల వాయిదా వల్ల వైద్యులు కోవిడ్ విధుల్లో ఉంటారన్న పీఎంవో
- వాయిదా వేయాలనుకుంటున్నట్టు ముందుగానే ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రి
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ పరీక్షలు నాలుగు నెలల పాటు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన కరోనాపై సమీక్షా సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. పరీక్షల వాయిదా కనీసం నాలుగు నెలలు ఉంటుందని... ఈ నిర్ణయం ద్వారా ఎంతో మంది డాక్టర్లు కరోనా పేషెంట్లకు చికిత్స చేసే విధుల్లో ఉంటారని ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది.
వైద్య రంగంలోని వారు కనీసం 100 రోజుల పాటు కోవిడ్ విధుల్లో ఉండేందుకు ఈ నిర్ణయం సహకరిస్తుందని పేర్కొంది. నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేసే యోచనలో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ నెల 15వ తేదీనే ప్రకటించిన విషయం గమనార్హం.