కోర్టుల వ్యాఖ్యలను ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించలేము: సుప్రీంకోర్టు
- కోర్టు వాదనలను మీడియా సంపూర్ణంగా ప్రసారం చేయాలి
- న్యాయ వ్యవస్థలో హైకోర్టులు చాలా కీలకం
- హైకోర్టులను మేము కించపరచలేము
కోర్టులో జరిగే వాదనలకు సంబంధించి రిపోర్టింగ్ చేయకుండా మీడియాను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, మీడియా ఇచ్చే సమాచారం స్పష్టంగా, సంపూర్ణంగా ఉండాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు ఈసీనే కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి... ఈసీ వేసిన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాకోణంలో మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను చూడాలని... కోర్టు వ్యాఖ్యలు చేదుగా ఉన్నప్పటికీ, మంచి స్ఫూర్తితో స్వీకరించాలని చెప్పింది.
మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను మీడియా ప్రముఖంగా ప్రసారం చేయడంపై తాము ఇప్పటికిప్పుడే కలగజేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాలు, ఉత్తర్వులు ఫైనల్ అని స్పష్టం చేసింది. హైకోర్టులను తాము కించపరిచబోమని చెప్పింది. న్యాయ వ్యవస్థలో హైకోర్టులు చాలా ప్రధానమైనవని తెలిపింది. విచారణ సమయంలో హైకోర్టు జడ్జిలు చేసే వ్యాఖ్యలను తాము నియంత్రించలేమని చెప్పింది.