నందిగ్రామ్ ఫలితంపై కోర్టును ఆశ్రయించేందుకు మమతా బెనర్జీ నిర్ణయం!
- పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ప్రభంజనం
- కానీ సీఎం మమతాకు నందిగ్రామ్ లో షాక్
- సువేందు చేతిలో ఓటమి
- తేడా జరిగిందంటున్న తృణమూల్ వర్గాలు
- ఊహాగానాలు ప్రచారం చేయొద్దంటూ ట్వీట్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామన్న తృప్తి టీఎంసీ శ్రేణులకు దక్కలేదు. అందుకు కారణంగా నందిగ్రామ్ లో సీఎం మమతా బెనర్జీ ఓటమి. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో మమత స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ ఫలితంపై పెద్దగా బాధపడాల్సిన పనిలేదని మమత పార్టీ నేతలను ఊరడించారు. అయితే, ఓట్ల లెక్కింపులో తేడా జరిగిందని, తాము దీనిపై కోర్టుకు వెళతామని ఆమె వెల్లడించారు.
కాగా, నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు అనంతరం సువేందు అధికారి 1,736 ఓట్ల తేడాతో నెగ్గినట్టు ప్రకటించారు. అయితే, దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ... నందిగ్రామ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని పేర్కొంది.