ఉనికి కూడా లేని స్థాయి నుంచి కీలక పార్టీగా ఎదిగాం: బెంగాల్‌లో బీజేపీ ఫలితాలపై మోదీ
- దీదీని అభినందించిన ప్రధాని
- కేంద్రం తరఫున సహకారం అందిస్తామని హామీ
- స్టాలిన్, విజయన్‌కూ శుభాకాంక్షలు
- కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేద్దామని పిలుపు
- పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి కృతజ్ఞతలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ గెలుపొందిన సందర్భంగా పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని రకాల మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే కొవిడ్‌ను రూపుమాపడంలోనూ సహకరిస్తామని భరోసానిచ్చారు.
అలాగే బెంగాల్‌లో బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకప్పుడు ఉనికి కూడా లేని స్థాయి నుంచి ఇప్పుడు బీజేపీ కీలక పార్టీగా రూపాంతరం చెందిందని వ్యాఖ్యానించారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను అభినందించారు.
అలాగే కేరళలో విజయం సాధించిన పినరయి విజయన్, ఆయన నేతృత్వంలోని కూటమి ఎల్‌డీఎఫ్‌కి కూడా మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొవిడ్ సహా వివిధ అంశాల్లో కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కేరళలో బీజేపీకి ఓటు వేసిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తమిళనాడులో విజయం సాధించిన డీఎంకే, ఆ పార్టీ అధినేత స్టాలిన్‌కు కూడా ప్రధాని అభినందనలు తెలియజేశారు. తమిళనాడు సంక్షేమం కోసం సహకరిస్తామని హామీ ఇచ్చారు.