పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో గెలిచిన నాయకులకు కేంద్ర మంత్రుల శుభాకాంక్షలు!
- బెంగాల్‌లో టీఎంసీ, కేరళలో ఎల్‌డీఎఫ్ గెలుపు
- తమిళనాడులో స్టాలిన్ విజయబావుటా
- శుభాకాంక్షలు తెలిపిన రాజ్‌నాథ్, సీతారామన్
- వెలువడాల్సిన తుది ఫలితాలు
పశ్చిమ బెంగాల్‌లో హ్యాట్రిక్ విజయం అందుకున్న తృణమూల్ కాంగ్రెస్‌కు బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రెండోసారి అధికారం చేపట్టబోతున్నందుకు దీదీకి అభినందనలు తెలియజేశారు.
అలాగే తమిళనాడులో విజయం సాధించిన డీఎంకే అధినేత స్టాలిన్, కేరళలో ఎల్‌డీఎఫ్ కూటమి నేత పినరయి విజయన్‌కు రాజ్‌నాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే తరహాలో బీజేపీ మరో సీనియర్ నాయకురాలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఆయా రాష్ట్రాల్లో గెలుపొందిన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్, తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం ఖరారైంది. తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సిన ఉన్నా.. ఇప్పటికే అత్యధిక స్థానాల్లో గెలుపొంది విజయ బావుటా ఎగురవేశాయి.