నీచ రాజకీయాలకు పాల్పడిన బీజేపీ ఓటమిపాలైంది: మమతా బెనర్జీ

  • బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ విజయవిహారం
  • మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న దీదీ
  • జై బంగ్లా అంటూ గర్జన
  • ఇక తాను కరోనా నియంత్రణలో పాలుపంచుకుంటున్నానని వెల్లడి
  • నిరాడంబరంగా ప్రమాణస్వీకారం
పశ్చిమ బెంగాల్ లో వరుసగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 200కి పైగా స్థానాలు దక్కనుండడంతో ఆ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో నీచ రాజకీయాలకు పాల్పడిన బీజేపీ ఓటమిపాలైందని అన్నారు. ఎన్నికల సంఘం రూపంలో తమకు భయానక అనుభవాలు ఎదురయ్యాయని, అన్నింటికి ఎదురొడ్డి నిలిచామని మమత అన్నారు.  

ఇది ప్రజలు అందించిన ఘనవిజయం అని, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు. ఇక తాను వెంటనే కొవిడ్ కట్టడి చర్యల్లో నిమగ్నమవుతాయని మమత వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, మీడియా సమావేశం ఆరంభంలో ఆమె జై బంగ్లా అంటూ గట్టిగా నినదించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు జరుపుకోవద్దని టీఎంసీ శ్రేణులకు సూచించారు.


More Telugu News