జోస్ బట్లర్ సెంచరీ... సన్ రైజర్స్ బౌలింగ్ ను చీల్చిచెండాడిన స్టార్ బ్యాట్స్ మన్
- ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్
- మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
- 64 బంతుల్లో 124 పరుగులు చేసిన బట్లర్
- 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసిన రాజస్థాన్
- ఛేదనలో దీటుగా స్పందించిన సన్ రైజర్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ సెంచరీ నమోదు చేశాడు. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన బట్లర్ కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు. బట్లర్ స్కోరులో 11 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి. బట్లర్ కు కెప్టెన్ సంజూ శాంసన్ (48) ఉపయుక్తమైన ఇన్నింగ్స్ తోడవడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు సాధించింది.
ఇక, భారీ లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ జట్టు దీటుగానే స్పందించింది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 1 వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 25 పరుగులతోనూ, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2 పరుగులతోనూ ఆడుతున్నారు. ధాటిగా ఆడిన ఓపెనర్ మనీశ్ పాండే 31 పరుగులు చేసి ముస్తాఫిజూర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. సన్ రైజర్స్ గెలవాలంటే ఇంకా 78 బంతుల్లో 160 పరుగులు చేయాలి.