భారత్ సహా ఏడు దేశాల పౌరులు అడుగుపెట్టకుండా ఇజ్రాయెల్ ఆంక్షలు
- తమ దేశ పౌరులు ఏడు దేశాలకు వెళ్లకుండా నిషేధం
- తమ దేశ పౌరులు కాని వారికి మినహాయింపు
- ఆయా దేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారైంటన్ తప్పనిసరి
భారత్‌లో కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో పలు దేశాలు భారత్ నుంచి ప్రయాణికులపైనా, తమ దేశ పౌరులపైనా ఆంక్షలు విధించాయి. తాజాగా, ఇజ్రాయెల్ కూడా ఈ జాబితాలో చేరింది. భారత్‌కు తమ దేశ పౌరులు వెళ్లకుండా ఇజ్రాయెల్ నిషేధించింది. రేపటి నుంచే ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.
కాగా, భారత్ సహా ఉక్రెయిన్, బ్రెజిల్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, టర్కీ దేశాలకు కూడా వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే, ఇజ్రాయెల్ పౌరులు కాని వారికి ఈ ఆంక్షలు వర్తించబోవని పేర్కొంది. మరోవైపు, ఈ ఏడు దేశాల నుంచి వచ్చే తమ దేశ పౌరులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరని స్పష్టం చేసింది.