కరోనా ఆంక్షలు, బస్సెక్కని ప్రజలు... నిలిచిన 880 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు!
- పెరుగుతున్న కరోనా కేసులు
- 50 శాతం ప్రయాణికులకే అనుమతి
- బస్సులు తిప్పలేమన్న ప్రైవేటు సంస్థలు
ఏపీలో దాదాపు 880 ప్రైవేటు బస్సులు నిన్నటి నుంచి నిలిచిపోయాయి. కరోనా నేపథ్యంలో సగం మంది ప్రయాణికులతోనే బస్సులను నడిపించాలని ప్రభుత్వాలు తేల్చి చెప్పడం, ఆపై ప్రయాణాలు చేసేందుకు ప్రజలు కూడా పెద్దగా ఆసక్తిని చూపక పోవడంతో, ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు తమంతట తాముగానే రవాణా శాఖను సంప్రదించి, బస్సులను నిలిపివేస్తున్నట్టు వెల్లడించాయి.
ఆపై రవాణా శాఖ వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, చెల్లించాల్సిన పాత పన్నులను వసూలు చేసి, సర్వీసులను నిలిపివేసేందుకు అనుమతించింది. ఇప్పటి నుంచి తిరిగి సర్వీసులను ప్రారంభించే వరకూ బస్సులకు ట్యాక్స్ రద్దు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.