బండి సంజయ్ ఏమైనా సత్యహరిశ్చంద్రుడా?: తలసాని
- బండి సంజయ్ పై తలసాని ఆగ్రహం
- నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక
- చవకబారు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు
- టీఆర్ఎస్ సర్కారు ఏంచేస్తోందో కేంద్రాన్ని అడగాలని సూచన
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు, ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కారు ఏంచేస్తోందో బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. తెలంగాణలో కరోనా స్థితిగతులపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతున్నారని, కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తలసాని వెల్లడించారు.
ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ తమపై చవకబారు వ్యాఖ్యలు చేయడం తగదని బండి సంజయ్ కు హితవు పలికారు. ఏదైనా ఆరోపణలు చేస్తే అందుకు తగిన ఆధారాలు ఉండాలని వ్యాఖ్యానించారు. అయినా బండి సంజయ్ చేసే ఆరోపణలన్నీ నిజాలయ్యేందుకు ఆయనేమన్నా సత్యహరిశ్చంద్రుడా? అని ప్రశ్నించారు.