ఎస్ బీఐ నుంచి తీపికబురు... గృహరుణాలపై వడ్డీరేటు తగ్గింపు
- కనిష్టంగా వడ్డీరేటును 6.7గా నిర్ణయించిన ఎస్ బీఐ
- రూ.30 లక్షల వరకు రుణాలకు వర్తింపు
- మహిళా రుణగ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల రాయితీ
- యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా 5 బేసిస్ పాయింట్లు
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై వడ్డీ రేటును 6.7 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు ఆ వడ్డీ రేటు 6.95గా ఉండేది. అంతేకాకుండా, మహిళా రుణగ్రహీతలపైనా ఎస్ బీఐ కరుణ చూపింది. వారికి 5 బేసిస్ పాయింట్ల మేర రాయితీ ప్రకటించింది. యోనో ఎస్ బీఐ యాప్ ద్వారా లోన్ కు దరఖాస్తు చేస్తే అదనంగా 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ లభిస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఎస్ బీఐ తాజా ప్రకటన అనంతరం వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి... రూ.30 లక్షల వరకు గృహరుణాలపై 6.7 శాతం, రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల రుణాలపై 6.95 శాతం, రూ.75 లక్షలకు పైబడిన రుణాలపై 7.05 శాతం వడ్డీ ఉంటుంది.