ఆ హిట్టు పాటను ఒక్క రోజులో తీశారట!
- 'ఎర్రమల్లెలు' అంటే చాలా ఇష్టం
- బాలనటుడిగా ఆ పాటలో కనిపిస్తాను
- డాన్స్ మాస్టర్ లేకుండానే షూట్ చేశారు
తెలుగు తెరకి ఆవేశాన్నీ .. ఉద్యమ నినాదాన్ని పరిచయం చేసిన విప్లవాత్మక చిత్రాలలో 'ఎర్రమల్లెలు' ముందు వరుసలో కనిపిస్తుంది. ధవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ సినిమా, అప్పట్లో యూత్ లో ఒక రకమైన చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాలోని పాటలను చాలామంది ఇప్పటికీ మరిచిపోలేదు. మాదాల రంగారావు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, మురళీ మోహన్ .. గిరిబాబు .. సాయిచంద్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అలాంటి ఈ సినిమా ఈ రోజుతో 40 ఏళ్లను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా మాదాల రంగారావు తనయుడు మాదాల రవి తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడారు. "మా నాన్న చేసిన సినిమాల్లో నాకు 'ఎర్రమల్లెలు' అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో 'నాంపల్లి టేషను కాడా రాజాలింగో .. 'పాటలో నేను బాలనటుడిగా కనిపిస్తాను. చిన్నప్పటి నుంచి నేను చాలా యాక్టివ్ గా ఉండేవాడిని. అందువలన మా నాన్న నాతోనే ఆ పాటలో చేయించారు. వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో టాప్ 100 సాంగ్స్ లో ఆ పాటకి చోటు దక్కడం విశేషం. ఆ పాటకి డాన్స్ మాస్టరు కూడా లేడు .. ఒక్క రోజులో షూట్ చేసేశారు" అన్ని చెప్పుకొచ్చారు.