కర్నూలులో ఘోరం... ఆక్సిజన్ అందక నలుగురి మృతి

  • కర్నూలు కేఎస్ కేర్ ఆసుపత్రిలో ఘటన
  • తీవ్ర ఆందోళనకు గురైన ఇతర పేషెంట్లు
  • అనుమతి లేకుండానే కరోనా చికిత్స చేస్తున్నారన్న జిల్లా కలెక్టర్
కర్నూలు జిల్లాలో ఘోరం సంభవించింది. ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా పేషెంట్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కేెఎస్ కేర్ ఆసుపత్రిలో జరిగింది. తోటి రోగులు ప్రాణాలు కోల్పోవడంతో ఇతర పేషెంట్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఇతర ఆసుపత్రులకు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. వారి సోదాల్లో ఐసీయూలో ఉన్న నాలుగు డెడ్ బాడీలు బయటపడ్డాయి.

జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కూడా ఆసుపత్రిని పరిశీలించారు. ఆక్సిజన్ లేక పేషెంట్లు చనిపోయారనే విషయం తమ దృష్టికి వచ్చిందని... విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమతి లేకుండానే ఇక్కడ కరోనా చికిత్స చేస్తున్నారని... ఆసుపత్రి ఎండీపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ గిడ్డయ్య ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు.


More Telugu News