ప్రభాస్ జోడీగా కత్రినా కైఫ్? .. వెండితెరపై అల్లకల్లోలమే!

  • పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్
  • పోటీపడుతున్న బాలీవుడ్ దర్శకులు
  • లైన్లోనే సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ .. ఆయన సినిమాలు వందల కోట్ల రూపాయలతో రూపొందుతున్నాయి .. వేల కోట్ల బిజినెస్ జరుపుకుంటున్నాయి. టాలీవుడ్ దర్శకులకు ఆయన డేట్లు దొరకడమే కష్టమైపోతోంది. ఇతర భాషలకి చెందిన బడా నిర్మాతలు .. దర్శకులు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. ఆయన తాజా చిత్రంగా 'రాధే శ్యామ్' రానుండగా, 'సలార్' .. ' ఆది పురుష్' ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. ఆ తరువాత ఆయన నాగ్ అశ్విన్ తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే కావడం విశేషం.

ఈ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయనేది తెలియదు .. కానీ ప్రభాస్ మాత్రం తన దూకుడు ఆపడం లేదు. 'వార్' వంటి యాక్షన్ సినిమాలతో 'ఔరా'! అనిపించిన సిద్ధార్థ్ ఆనంద్ కి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఆయన 'కత్రినా కైఫ్' ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖాయమవుతుందనే అంటున్నారు. కత్రినా మంచి పొడగరి కనుక .. తెరపై ఈ జోడీ ఒక రేంజ్ లో సందడి చేయవచ్చు. శ్రద్ధా కపూర్ .. కృతి సనన్ తరువాత ప్రభాస్ సరసన కత్రినా కనువిందు చేయనుందన్న మాట.



More Telugu News