మంత్రాలయంలో భక్తులకు దర్శనాలు బంద్!

  • రేపటి నుంచి భక్తులకు దర్శనాలు బంద్
  • నిత్యపూజలు ఏకాంతంగా జరుగుతాయన్న మఠం
  • కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
కరోనా ప్రభావం ప్రముఖ ఆలయాలపై కూడా పడుతోంది. కేసులు అమాంతం పెరిగిపోతుండటంతో మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠం కీలక నిర్ణయం తీసుకుంది. మఠంలో భక్తులకు రేపటి నుంచి దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భక్తులు ఎవరూ మఠానికి రాకూడదని కోరింది. అయితే, రాఘవేంద్రస్వామి వారికి నిత్యపూజలు ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపింది.

కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. భక్తులను తిరిగి ఎప్పుడు అనుమతిస్తామనే నిర్ణయాన్ని పరిస్థితులను బట్టి తర్వాత తెలియజేస్తామని చెప్పింది. రానున్న రోజుల్లో పలు ఆలయాలు ఇదే దిశగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News