ఈటెల రాజేందర్ వ్యవహారంపై విచారణకు కేసీఆర్ ఆదేశం.. విజయశాంతి స్పందన!

  • ఈటలపై భూకబ్జా ఆరోపణలు
  • బలహీనవర్గాలను దొర కుటుంబం అణచివేస్తోందన్న విజయశాంతి
  • దొర అహంకారపు ధోరణుల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభిస్తుంది
తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. మెదక్ జిల్లా మసాయి పేట మండలంలోని భూమిని ఆయన కబ్జా చేసినట్టు వార్తలు వచ్చాయి. వెంటనే ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

లక్ష కోట్లు మింగిన ఈ దొర కుటుంబం బడుగు, బలహీనవర్గాలపై చేస్తున్న అణచివేతల ప్రక్రియలో తమ్ముడు ఈటల రాజేందర్ గారిది మరో దుర్మార్గమని విజయశాంతి విమర్శించారు. ఈ దొర అహంకారపు ధోరణుల నుంచి తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తి తప్పక లభించి తీరుతుందని అన్నారు. మరోవైపు కాసేపట్లో ఈటల రాజేందర్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఆయన ఏం చెప్పబోతున్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


More Telugu News