ఈటల భూకబ్జాలపై నిగ్గు తేల్చాలంటూ విజిలెన్స్ డీజీని ఆదేశించిన సీఎం కేసీఆర్

  • మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలు
  • వెలుగులోకి తెచ్చిన విశ్రాంత కలెక్టర్
  • అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు
  • తీవ్రంగా పరిగణిస్తున్న సీఎం కేసీఆర్
  • మరికాసేపట్లో మీడియా ముందుకు ఈటల
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఆయన మెదక్ జిల్లా మూసాయిపేట మండలంలోని 130/5, 130/10, 64/6 స‌ర్వే నెంబ‌ర్ల‌లో గ‌ల భూమిని కబ్జా చేసినట్టు అక్కడి రైతులే ఆరోపిస్తున్నారు. మంత్రి ఈట‌ల భూకబ్జాల వ్యవహారాన్ని మెద‌క్ జిల్లా రిటైర్డ్ క‌లెక్ట‌ర్ ధ‌ర్మారెడ్డి వెలుగులోకి తెచ్చినట్టు సమాచారం.

కాగా, తన క్యాబినెట్లోని ముఖ్యమైన పోర్ట్ ఫోలియో చూస్తున్న ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలంటూ విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు మంత్రి ఈటల మరికాసేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.


More Telugu News