తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ వినియోగం... అనుమతించిన డీజీసీఏ
- వ్యాక్సిన్ పంపిణీకి వినూత్న చర్యలు
- డ్రోన్ వినియోగానికి అనుమతి కోరుతూ దరఖాస్తు
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డీజీసీఏ
- ఏడాది పాటు అనుమతి మంజూరు
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించింది. దీనికి డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అనుమతి కూడా లభించింది. డ్రోన్ల వినియోగంపై డీజీసీఏ అనుమతి ఏడాది పాటు అమల్లో ఉండనుంది.
తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేత
కరోనా వ్యాక్సిన్ల కొరతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ డోసుల పంపిణీ నిలిపివేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యాధికారులకు వైద్య సంచాలకుడి నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డోసులు వాడుకోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు సూచించారు. మిగిలిన టీకా డోసులు సేకరించాలని వైద్యాధికారులకు, ఫార్మసిస్టులకు స్పష్టం చేశారు.
అటు, తెలంగాణలో సినిమా ప్రదర్శనలపై ఆంక్షలను ప్రభుత్వం మరింత పొడిగించింది. వచ్చే నెల 8 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.