18 ఏళ్లు పైబ‌డిన వారికి రేపు వ్యాక్సిన్ వేయ‌ట్లేదు.. వ‌చ్చి క్యూలు క‌ట్టకూడ‌దు: కేజ్రీవాల్

  • వ్యాక్సిన్ల కొర‌త వ‌ల్ల వేయ‌ట్లేదు
  • వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే ప్ర‌క‌ట‌న చేస్తాం
  • 67 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌కు ఆర్డ‌ర్
  • రేపు లేక ఎల్లుండి మూడు ల‌క్ష‌ల డోసుల‌ కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వ‌స్తాయి
దేశంలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వారికి కూడా మే1 నుంచి వ్యాక్సిన్లు వేస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, దేశంలో వ్యాక్సిన్ల కొర‌త వ‌ల్ల అది సాధ్య‌ప‌డ‌ద‌ని ఇప్ప‌టికే ఎన్నో రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్ప‌ష్టం చేశాయి. ఈ రోజు మీడియా స‌మావేశంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇదే విష‌యాన్ని మ‌రోసారి తేల్చి చెప్పారు.

18 ఏళ్లు పైబ‌డిన వారికి రేపు వ్యాక్సిన్లు వేయ‌ట్లేద‌ని ప్ర‌క‌టించారు. వ్యాక్సిన్ల కొర‌త వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, టీకాలు అందుబాటులోకి వ‌చ్చాక మ‌ళ్లీ ఈ విష‌యంపై ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు రేపు క‌రోనా వ్యాక్సిన్ కేంద్రాల ముందు క్యూలు క‌ట్టి నిల‌బ‌డ‌కూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే తామే ప్ర‌క‌ట‌న చేసి చెబుతామ‌ని అన్నారు. తాము 67 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌కు ఆర్డ‌ర్ ఇచ్చామ‌ని చెప్పారు. వాట‌న్నింటికీ బిల్లులు చెల్లించేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. ఢిల్లీకి రేపు లేక ఎల్లుండి మూడు ల‌క్ష‌ల డోసుల‌ కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వ‌స్తాయ‌న్నారు.  ఢిల్లీలోని ప్ర‌జ‌ల‌కు మూడు నెల‌ల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు.



More Telugu News