ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై పునరాలోచించాలి: ఏపీ సర్కారుకి హైకోర్టు ఆదేశం
- పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్లు
- హైకోర్టులో విచారణ
- తదుపరి విచారణను మే 3కు వాయిదా
కరోనా విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతున్నప్పటికీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. దీనిపై వచ్చిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై పునరాలోచించాలని ఏపీ సర్కారుని హైకోర్టు ఆదేశించింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలిపింది. పక్క రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారని గుర్తు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.
కాగా, పరీక్షలను కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహిస్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పింది. పదో తరగతి పరీక్షలను జూన్ 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు.