అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ఇన్ని ఉపద్రవాలు: చంద్రబాబు
- ఇలాంటి పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి
- అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు
- తుగ్లక్ నిర్ణయానికి 29 వేల మంది రైతులు బాధపడుతున్నారు
- మహిళలను బూటు కాళ్లతో తన్నించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని రైతుల దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు.
'ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు. తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే, 500 రోజులలో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి' అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
'కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ అన్నారు. రాష్ట్ర రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్లతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు' అని చంద్రబాబు చెప్పారు.
'పాలకులు ఎంత నిర్దయగా ప్రవర్తిస్తున్నా, ప్రజా రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు 500 రోజులుగా శాంతియుతంగా నిరాటంకంగా తమ ఆందోళనను కొనసాగిస్తోన్న రైతులు, రైతు కూలీలు, మహిళలకి అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నాను' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.