రేపటి నుంచి బ్రిటన్ కు ఎయిరిండియా విమానాలు!
- ఏప్రిల్ 24 నుంచి ఆగిన విమానాలు
- మే 16 వరకూ పరిమిత సంఖ్యలో విమానాలు
- ట్విట్టర్ లో వెల్లడించిన ఎయిరిండియా
ఏప్రిల్ 24 నుంచి యూకేకు రద్దయిన విమానాలను మే 1 నుంచి పునరుద్ధరించునున్నట్టు ప్రభుత్వ రంగ పౌరవిమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. ఇండియాలో కరోనా రెండో దశ కొనసాగుతున్న వేళ, చాలా దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. బ్రిటన్ కూడా ఇండియా విమానాలను నిలిపివేసింది.
కాగా, 1 నుంచి న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల నుంచి యూకేలోని హీత్రూకు విమానాలను నడిపిస్తామని అధికారులు తెలిపారు. 16వ తేదీ వరకూ పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తాయని, ఆ తరువాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఎయిరిండియా పేర్కొంది.