నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఎగ్జిట్ పోల్స్... టీఆర్ఎస్ కే పట్టం!
- ఈ నెల 17న సాగర్ అసెంబ్లీ స్థానంలో పోలింగ్
- ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన ఆరా, ఆత్మసాక్షి
- అత్యధిక శాతం ఓట్లతో ప్రథమస్థానంలో టీఆర్ఎస్
- తర్వాత స్థానంలో కాంగ్రెస్
- బీజేపీకి మూడో స్థానం
ఈ నెల 17న నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీలకు ఎన్నికలు ముగియడంతో వరుసగా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. సాగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలను 'ఆరా' సంస్థ వెల్లడించింది. అధికార టీఆర్ఎస్ కే ఓటర్లు మరోమారు పట్టం కట్టినట్టు 'ఆరా' తన అంచనాల్లో పేర్కొంది. టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 39.93 శాతం, బీజేపీకి 6.31 శాతం ఓట్లు వచ్చినట్టు తెలిపింది.
అటు, ఇదే ఉప ఎన్నికపై 'ఆత్మసాక్షి' సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పంచుకుంది. ఇందులోనూ టీఆర్ఎస్ కే అగ్రతాంబూలం దక్కింది. గులాబీ దండుకు 43.5 శాతం, కాంగ్రెస్ పార్టీకి 36.5 శాతం, బీజేపీకి 14.6 శాతం ఓటింగ్ వచ్చినట్టు 'ఆత్మసాక్షి' వివరించింది.