కరోనాపై పోరులో చేయి కలిపిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. దేశ రాజధానిలో సహాయ కార్యక్రమాలకు విరాళం!

  • కరోనాపై భారత్‌ తిరుగులేని పోరాటం
  • అండగా నిలుస్తున్న ఐపీఎల్‌ ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు
  • రూ.1.5 కోట్లు విరాళం ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్‌
  • దేశ రాజధానిలో వైద్య అవసరాల కోసం కేటాయింపు
  • హేమ్‌కుంట్‌ ఫౌండేషన్‌, ఉదయ్‌ ఫౌండేషన్‌ ద్వారా సాయం
కరోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న పోరులో ఐపీఎల్‌ జట్లు, ఆటగాళ్లు తమ వంతుగా సాయం అందిస్తున్నారు. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన ప్యాట్‌ కమిన్స్‌, వ్యాఖ్యాత బ్రెట్‌లీ తమ వంతుగా భూరి విరాళం ప్రకటించగా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ ఆటగాళ్లు, దాని స్పాన్సర్లకు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌, జీఎంఆర్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌ సాయానికి సిద్ధమయ్యారు. కరోనాతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీకి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు.

ఈ మొత్తాన్ని ఢిల్లీలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న హేమ్‌కుంట్‌ ఫౌండేషన్‌, ఉదయ్‌ ఫౌండేషన్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, సంరక్షణ కిట్లు సహా ఇతర అత్యవసర వైద్య సామగ్రి కొనుగోలు చేసేందుకు వినియోగించాలని నిర్ణయించారు.


More Telugu News