ఏపీ సచివాలయంలో కరోనాతో డేటా ఎంట్రీ ఆపరేటర్ మృతి... భయం గుప్పిట్లో ఇతర ఉద్యోగులు!

  • ఏపీ సెక్రటేరియట్ లో కరోనా కలకలం
  • ఇంతకుముందు ఐదుగురి మృతి
  • తాజాగా మరో ఉద్యోగి కన్నుమూత
  • ఆరుకి చేరిన కరోనా మరణాలు
అమరావతిలోని ఏపీ సచివాయంలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. తాజాగా ఏపీ సచివాలయంలో మరో ఉద్యోగి కరోనాతో మృతి చెందాడు. సాధారణ పరిపాలన శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న కిశోర్ కుమార్ కరోనాతో కన్నుమూశాడు. దాంతో కొవిడ్ మహమ్మారికి బలైన సచివాలయ ఉద్యోగుల సంఖ్య 6కి పెరిగింది.

ఇంతకుముందు, ఏఎస్ఎన్ మూర్తి, శాంతకుమారి, పద్మారావు, రవికాంత్, శ్రీనివాస్ అనే సచివాలయ ఉద్యోగులు కరోనాకు బలయ్యారు. తాజాగా కిశోర్ కుమార్ మరణంతో సచివాలయ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తమకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు ఉద్యోగులు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది.


More Telugu News