కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్... ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

  • ఇటీవల మన్మోహన్ కు కరోనా పాజిటివ్
  • ఈ నెల 19న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిక
  • తాజా పరీక్షలో నెగెటివ్
  • ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న మన్మోహన్
ఇటీవలే కరోనా బారినపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి నుంచి ఈ ఉదయం మన్మోహన్ సింగ్ ను డిశ్చార్జి చేశారు. 88 ఏళ్ల మన్మోహన్ సింగ్ కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 19న ఎయిమ్స్ లో చేరారు.

ఆయన ఇటీవలే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. మార్చి 4న తొలి డోసు, ఏప్రిల్ 3న రెండో డోసు తీసుకున్నారు. తేలికపాటి లక్షణాలే కనిపించినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.


More Telugu News