ఇక అధికారం నాదే.. నోటిఫికేషన్ ఇచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
- ఢిల్లీ సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా ఎల్జీ అనుమతి తప్పనిసరి
- సబార్డినేట్ చట్టాలూ ఎల్జీ పరిధిలోకి
- పోలీస్, ల్యాండ్ కూడా ఆయన చేతుల్లోకే
- పెరోల్ అనుమతులూ ఆయన ఇవ్వాల్సిందే
ఢిల్లీ పాలనా వ్యవహారాల విషయంలో అన్ని అధికారాలూ తనవేనని పేర్కొంటూ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్ ఈరోజు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. బుధవారం ఢిల్లీ పాలనపై సర్వాధికారాలూ ఎల్జీవేనంటూ కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా ఎల్జీ అనిల్ బైజాల్ తాజా నోటిఫికేషన్ విడుదల చేశారు.
దాని ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇకపై ఎల్జీని సంప్రదించి అమలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ తాజా మార్గదర్శకాలను వెలువరిస్తుందని ఎల్జీ ఆఫీస్ ప్రకటించింది.
నోటిఫికేషన్ ప్రకారం ఎల్జీ పరిధిలోకి వచ్చే అధికారాలివీ..

- పార్లమెంట్ చేసిన చట్టాలు, రాజధాని ప్రాంతానికి వర్తించే చట్టాల్లోని అంశాలన్నీ ఇకపై రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు లేదా రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులోని జాబితాలకూ వర్తిస్తాయి.
- పోలీస్, ప్రజా భద్రత, భూమి, సేవలు వంటివీ ఎల్జీ పరిధిలోకే వస్తాయి.
- నియమనిబంధనలు, పథకాలు, బై లా వంటి సబార్డినేట్ చట్టాలూ ఎల్జీ పరిధిలోకే.
- నిర్మాణాలు, కట్టడాలు, కూల్చివేతలు, బోర్డులు, కమిటీలు, కమిషన్ల వంటి చట్టబద్ధ సంస్థల ఏర్పాటు/పునర్విభజన అధికారాలు.
- ఢిల్లీ ఆర్థిక సంఘం చట్టం 1994 ప్రకారం ఢిల్లీ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల్లోని వ్యవహారాలు
- ఢిల్లీ జైళ్ల చట్టం 2000 నియమనిబంధనల ప్రకారం పెరోల్ అనుమతులు
- ఢిల్లీ రాజధాని ప్రాంత ప్రభుత్వ వ్యవహారాల నియమాలు 1993లోని రూల్ 23లో పేర్కొన్న విషయాలు.