ముక్కులో నిమ్మరసం పిండుకుంటే కరోనా రాదనుకున్నాడు... కానీ కడతేరిపోయాడు!
- కర్ణాటకలో విషాద ఘటన
- సోషల్ మీడియా ప్రచారం నిజమని నమ్మిన ఉపాధ్యాయుడు
- ముక్కులో నిమ్మరసం పిండుకుని మృతి
- కుటుంబంలో విషాదం
ముక్కులో నిమ్మరసం పిండుకుంటే కరోనా రాదని ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు ప్రచారం అవుతోంది. ఇలాంటి పోస్టులను నిజమేనని నమ్మితే చివరికి ప్రాణం పోయిన ఘటన కర్ణాటకలో జరిగింది. రాయచూరు జిల్లాలో నివసించే బసవరాజ్ ఓ టీచర్. 43 ఏళ్ల బసవరాజ్ ముక్కులో నిమ్మరసం పిండుకోవడం గురించి తెలుసుకుని, తాను కూడా అలాగే చేశాడు.
నిమ్మరసం ముక్కులో పిండుకుంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు దరిచేరవని, తద్వారా కరోనా రాకుండా ఉంటుందని నమ్మాడు. కానీ విషాదకర రీతిలో ముక్కులో నిమ్మరసం పిండుకున్న తర్వాత బసవరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చివరికి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతడి కుటుంబంలో విషాదం అలముకుంది.