కరోనా వేళ సాయం చేస్తామన్న ఐరాస.. వద్దన్న భారత్
- కరోనా మెటీరియల్‌కు సంబంధించి సాయం
- సమీకృత సప్లై చైన్ ద్వారా చేస్తామని ఐరాస
- భారత్‌లో ఇప్పటికే లాజిస్టిక్స్‌కు సంబంధించినంత వరకు బలమైన వ్యవస్థ
కరోనాతో అల్లాడిపోతోన్న భారత్‌కు సాయం చేసేందుకు ఐక్యరాజ్య సమితి ముందుకు రాగా అందుకు భారత్ ఒప్పుకోలేదు. కరోనా మెటీరియల్‌కు సంబంధించి తమ సమీకృత సప్లై చైన్ ద్వారా సాయం చేస్తామని ఐక్యరాజ్య సమితి తాజాగా చెప్పింది.
అయితే, భారత్‌లో ఇప్పటికే లాజిస్టిక్స్‌కు సంబంధించినంత వరకు బలమైన వ్యవస్థ ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఐక్యరాజ్య సమితి వెనకడుగు వేసింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తాజాగా చెప్పారు.
అయినప్పటికీ, కరోనా వేళ భారత్‌కు వీలైనంత సాయం చేయడానికి తాము సిద్ధమేనని ఐరాస ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. కరోనాకు సంబంధించి భారత్‌కు ఇప్పటివరకు తమ నుంచి ఎలాంటి సాయమూ అందలేదని ఆయన గుర్తు చేశారు.
భారత్ అడిగితే మాత్రం సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కరోనా నియంత్రణ, సాయం కోసం ఐక్యరాజ్యసమితి నుంచి సిబ్బందిని పంపేందుకు కూడా సిద్ధమని చెప్పారు.