ఇండియాలోని బ్యాంకులకు షాకిచ్చిన సుప్రీంకోర్టు!
- స.హ చట్టం నుంచి మినహాయించాలన్న బ్యాంకులు
- పిటిషన్ ను విచారించిన అత్యున్నత ధర్మాసనం
- తిరస్కరించిన సుప్రీంకోర్టు
సమాచార హక్కు చట్టం నుంచి తమను మినహాయించాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. రుణ ఎగవేతదారుల జాబితాలను, వార్షిక నివేదికల సమాచారాన్ని ఆర్బీఐ వెల్లడించాలంటూ, గతంలో వెల్లడించిన తీర్పును వెనక్కు తీసుకునేందుకు తిరస్కరించింది. దీంతో బ్యాంకులకు షాక్ తగిలినట్లయింది.
గతంలో ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని ఆర్థిక సంస్థలు, బ్యాంకులు పిటిషన్ వేయగా, విచారించిన అత్యున్నత ధర్మాసనం, తమ నిబంధనలల్లో అటువంటి ఏవీ లేవని తేల్చి చెప్పింది. అయితే, ఈ తరహా కేసుల్లో చట్టపరంగా ఉన్న ఇతర అవకాశాలను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది.