వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ సైట్ కు నిమిషానికి 27 లక్షల హిట్లు!

  • మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్
  • రిజిస్ట్రేషన్ కోసం పోటెత్తుతున్న ప్రజలు
  • రానున్న రోజుల్లో స్లాట్ల సంఖ్య పెరుగుతుందన్న ప్రభుత్వ వర్గాలు
మన దేశంలో 18 ఏళ్లకు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ల కోసం జనాలు వెబ్ సైట్ లోకి ఎంటర్ అవుతున్నారు. వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసిన కోవిన్ వెబ్ సైటుకు ప్రతి నిమిషానికి ఏకంగా 27 లక్షల హిట్లు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లు నిర్ధారించే స్లాట్ల ఆధారంగా వ్యాక్సినేషన్ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రానున్న రోజుల్లో స్లాట్స్ సంఖ్య పెరుగుతుందని తెలిపింది. వ్యాక్సినేషన్ల స్లాట్స్ అందుబాటులో లేకుంటే... కాసేపటి తర్వాత మరోసారి ప్రయత్నించాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలని... కొంచెం ఓపిక వహించాలని తెలిపింది.

మే 1వ తేదీ (శనివారం) నుంచి 18 ఏళ్లు పైబడిన అందిరికీ వ్యాక్సిన్ వేయబోతున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు ... https://www.cowin.gov.in/home కు లాగిన్ అయి... register/sign-in క్లిక్ చేయాలి. ఆ తర్వాత వివరాలను నమోదు చేయాలి.


More Telugu News