సీఎం కేసీఆర్ కు కరోనా నెగెటివ్
- ర్యాపిడ్ టెస్టులో కేసీఆర్ కు కరోనా నెగెటివ్
- రేపు రానున్న ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు
- ప్రస్తుతం ఫామ్ హౌస్ లో ఐసొలేషన్ లో ఉన్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా నెగెటివ్ నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రికి ఈరోజు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలను వైద్యులు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్టులో కేసీఆర్ కు నెగెటివ్ వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ఆర్టీపీసీఆర్ రిపోర్టు రేపు వస్తుందని చెప్పారు.
ఈ నెల 19న కోవిడ్ టెస్టులు చేయించుకోగా కేసీఆర్ కు పాజిటివ్ గా నిర్దారణ అయింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. తన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.
ఈ నెల 21న సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో ఆయన సీటీ స్కాన్ తో పాటు, ఇతర సాధారణ పరీక్షలను చేయించుకున్నారు. ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని సీటీ స్కాన్ లో తేలిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ర్యాపిడ్ టెస్టులో ఆయకు నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.