ప్రతి ఏడాది కరోనా బూస్టర్‌ డోసు తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు: బయోఎన్‌టెక్‌ సీఈఓ

  • ఐరోపాలో మరో 4 నెలల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ
  • 70శాతం మందికి టీకా ఇస్తే వ్యాప్తికి అడ్డుకట్టే
  • సమయం గడుస్తున్న కొద్దీ బలహీనపడుతున్న రోగనిరోధకత
  • 6 నెలల్లో 95 నుంచి 91 శాతానికి పడిపోయిన సామర్థ్యం
  • 9-12 నెలల మధ్య మూడో డోసు తీసుకోవాల్సిన అవసరం
ఐరోపాలో మరో నాలుగు నెలల్లో కరోనాపై సామూహిక రోగనిరోధకత(హెర్డ్‌ ఇమ్యూనిటీ) ఏర్పడుతుందని ఫైజర్‌తో కలిసి కరోనా టీకా రూపొందించిన బయోఎన్‌టెక్‌ తెలిపింది. 70 శాతం మందికి టీకా ఇస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి.  

ఫైజర్‌తో కలిసి తమ సంస్థ రూపొందించిన టీకా(దీన్నే ఫైజర్‌ టీకాగా పేర్కొంటున్నారు)నే ఐరోపాలో ఎక్కువ శాతం మంది ప్రజలకు ఇచ్చారని బయోఎన్‌టెక్‌ సీఈఓ ఉగుర్‌ సహిన్‌ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. వ్యాక్సిన్‌ వల్ల ఏర్పడుతున్న రోగనిరోధకత సమయం గడుస్తున్న కొద్దీ బలహీనపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మూడో డోసు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఆరు నెలల్లో టీకా సామర్థ్యం 95 శాతం నుంచి 91 శాతానికి తగ్గినట్లు గుర్తించామని సహిన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో తొలి డోసు తీసుకున్న తర్వాత 9-12 నెలల మధ్య మూడో తీసుకుంటే రోగనిరోధకత 100 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. ఇలా ప్రతి ఏడాది లేదా కనీసం 18 నెలలకోసారి బూస్టర్‌ డోసు తీసుకోవాల్సిన అసవరం రావొచ్చని చెప్పారు.


More Telugu News