శ్రీలంక ఆటగాడు జోయ్‌సాపై ఆరేళ్ల నిషేధం విధించిన ఐసీసీ
- నువాన్ జోయ్సాపై అవినీతి ఆరోపణలు నిరూపితం
- ఏ స్థాయి క్రికెట్లో కూడా ఆడకూడదని ఐసీసీ ఆదేశం
- శ్రీలంక తరపున 125 మ్యాచులు ఆడిన జోయ్సా
శ్రీలంక క్రికెటర్లు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. శ్రీలంక మాజీ పేసర్ నువాన్ జోయ్సాపై ఐసీసీ ఆరేళ్ల పాటు నిషేధాన్ని విధించింది. ఏ స్థాయి క్రికెట్లో కూడా ఆడటానికి వీల్లేదని ఆదేశించింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతంలోనే జోయ్సా సస్పెండ్ అయ్యాడు. అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి నమోదైన మూడు అభియోగాలు నిజమని తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక తరపున జోయ్సా 125 మ్యాచులు ఆడాడు. దశాబ్ద కాలంపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. తన కెరీర్ లో పలు అవినీతి ఆరోపణలతో యాంటీ కరప్షన్ సెషన్స్ కు హాజరయ్యాడు. జోయ్సా అవినీతిపరులతో చేతులు కలపడమే కాకుండా.. పలువురుని ఆ రొంపిలోకి దించేందుకు యత్నించాడని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపాడు. 95 టెస్టులు, 30 వన్డేలు ఆడిన జోయ్సా... 172 వికెట్లు తీసుకున్నాడు.