ఐపీఎల్ లో ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆందోళనపై రికీ పాంటింగ్ స్పందన

  • భారత్ లో అమాంతం పెరిగిపోతున్న కరోనా కేసులు
  • ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో ఆందోళన
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న రికీ పాంటింగ్
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రాబోతోందనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. భారత్ నుంచి విమాన రాకపోకలను తమ దేశాలు రద్దు చేయడంతో వారి ఆందోళన మరింత పెరుగుతోంది. తిరిగి స్వదేశానికి ఎలా చేరుకోవాలా అనే ఆందోళనలో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా కూడా నిన్న భారత విమానాలపై నిషేధం విధించింది. వచ్చే నెల 15 వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు. ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు స్వదేశానికి రావాలంటే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసీస్ ఆటగాళ్లు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మైదానం వెలుపల ఉన్న పరిస్థితులతో పోల్చితే, బబుల్ లో ఉండే ఆటగాళ్ల ఇబ్బంది చాలా చిన్న విషయమని తెలిపారు. తిరిగి వెళ్లడం అనే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుత దారుణ పరిస్థితుల్లో ఐపీఎల్ ఎంతో మందికి వినోదం కలిగిస్తోందని తెలిపారు.


More Telugu News