సంగం డెయిరీపై 20 ఏళ్ల కిందటే కుట్ర జరిగింది... రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాడు: చంద్రబాబు
- సంగం డెయిరీ వివాదంపై చంద్రబాబు స్పందన
- అమూల్ కోసం సంగంను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణ
- పాడిరైతులకు చెడు చేయడం తగదని హితవు
- కోర్టు పెండింగ్ లో ఉంచిన అంశంపై అరెస్ట్ ఎలా చేస్తారన్న చంద్రబాబు
సంగం డెయిరీ వివాదంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. నాడు యడ్లపాటి వెంకట్రావు సంగం డెయిరీని ప్రారంభించారని, ఆ తర్వాత సంగం డెయిరీని ధూళిపాళ్ల వీరయ్య ఎంతో అభివృద్ధి చేశారని వెల్లడించారు. సంగం డెయిరీపై 20 ఏళ్ల కిందటే కుట్రలు జరిగాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాడని వెల్లడించారు.
ప్రస్తుత వ్యవహారంపై స్పందిస్తూ.... ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ కాకముందే భూ బదలాయింపు జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు. అమూల్ కోసం సంగం డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న అంశంపై అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పాడిరైతులకు చెడు చేయడం తగదని హితవు పలికారు.