8 నెలల గర్భవతిగా ఉన్న డ్రగ్ క్వీన్.. నాలుగో భర్త చేతిలో హతం
- ఢిల్లీ నిజాముద్దీన్ లో ఘటన
- 12 రౌండ్లు కాల్పులు జరిపిన భర్త వసీం
- ఇటీవలే జైలు నుంచి విడుదల
- అప్పటికే ఆమె చెల్లెలితో వసీంకు వివాహేతర సంబంధం
- ఆమె విడుదలతో కలవలేకపోతున్న వైనం
- హత్యలో ఆమె చెల్లెలి పాత్రపైనా పోలీసుల దర్యాప్తు
ఆమె ఢిల్లీలో పేరుమోసిన మాదక ద్రవ్యాల ముఠా లీడర్. నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. జైలుకు వెళ్లి వచ్చింది. 8 నెలల గర్భవతి కావడంతో ఇటీవలే విడుదలైంది. నాలుగో భర్త చేతిలో హతమైంది. మంగళవారం ఢిల్లీలోని నిజాముద్దీన్ లో తన ఇంట్లోనే జరిగిన ఈ హత్య ఘటన కలకలం రేపింది. చనిపోయిన ఆ ‘డ్రగ్ క్వీన్’ను సైనా అని పోలీసులు గుర్తించారు. ఆమె నాలుగో భర్త వసీం హత్య చేశాడని చెప్పారు.
8 నెలల గర్భవతి.. కడుపులో కవలలు
సైనాకు వసీం కన్నా ముందు ముగ్గురితో పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు ఆమె పద్ధతి నచ్చక విడాకులు తీసుకుని బంగ్లాదేశ్ కు వెళ్లిపోయారు. షరాఫత్ షేక్ అనే డ్రగ్ డీలర్ ను మూడో వివాహం చేసుకుంది. డ్రగ్స్ ను తరలిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీంతో గత ఏడాది వసీంను నాలుగో పెళ్లి చేసుకుంది. ఆ వెంటనే డ్రగ్స్ కేసులోనే ఆమెనూ పోలీసులు అరెస్ట్ చేశారు.
8 నెలల గర్భవతిగా ఉన్న ఆమెను పోలీసులు బెయిల్ పై విడుదల చేశారు. అయితే, ఎందుకో ఏమో గానీ, మంగళవారం రెండు తుపాకులతో వచ్చిన వసీం ఆమెపై 12 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన సర్వెంట్ నూ షూట్ చేశాడు. ఆ తర్వాత సైనాపై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోగా.. గాయపడిన ఆమె సర్వెంట్ ను ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత అతడు నిజాముద్దీన్ పోలీసులకు లొంగి పోయాడు.
సైనా చెల్లెలితో వివాహేతర సంబంధం.. ఆమె చెల్లెలే చంపించిందా?
సైనా జైలు శిక్ష కాలంలో.. ఆమె చెల్లెలు రెహానాతో వసీంకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె జైలు నుంచి విడుదలయ్యాక రెహానాను కలవడం వీలు పడలేదు. ఈ క్రమంలోనే ఇటు సైనా అటు రెహానాతో అతడు తరచూ ఘర్షణ పడేవాడు. ఆ కక్షతోనే సైనాను చంపి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఇప్పటి దాకా అతడిపై ఎలాంటి నేరారోపణలు లేవని అంటున్నారు. దీంతో ఆమె చెల్లెలు రెహానా పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య వెనుక మాస్టర్ మైండ్ ఆమేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.