ఆసుప‌త్రి వ‌ద్ద‌ వైద్య అధికారి కాళ్లు మొక్కిన క‌రోనా రోగి బంధువులు... వీడియో వైర‌ల్!

  • ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఘ‌ట‌న‌
  • రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ కొరత
  • ఆ ఔష‌ధం కోసం కుటుంబ స‌భ్యుల వేడుకోలు
క‌రోనా చికిత్స‌కు వాడుతోన్న‌ రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రెమ్‌డెసివిర్ ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ కొంద‌రు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆసుప‌త్రుల్లోని రోగుల‌కు స‌రిప‌డా ఆ ఔష‌ధం అంద‌ట్లేదు.

ఆ ఔష‌ధాన్ని తెచ్చుకోవాల‌ని రోగుల బంధువుల‌కు వైద్యులు చెబుతుండ‌డంతో దాన్ని ఎక్క‌డి నుంచి తెచ్చుకోవాలో కూడా తెలియ‌క చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఔష‌ధం కోసం అధికారుల కాళ్లు మొక్కాల్సి వ‌స్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ ఆసుప‌త్రిలో ఇటువంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది.

కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ వాళ్లకు రెమ్‌డెసివిర్‌ ఇప్పించాలని ఓ కుటుంబ సభ్యులు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ దీపక్‌ ఓహ్రీ కాళ్లు మొక్కుతూ వేడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దేశంలో ఆసుప‌త్రుల వ‌ద్ద ఎటువంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుందని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.



More Telugu News